9, నవంబర్ 2008, ఆదివారం

నా జీవిత కథ






అన్ని ఉన్నా .....?
ఒంటరిని........
గ్లప్తంగా
నా చిన్ననాటి ......................
మేము తమిళియన్స్ ఇంట్లో అందురు తమిళ్ మాట్లాడేవాళ్ళు నాకు తెలుగు సరిగ్గా రాదు అప్పుడు నాకు నాలుగేళ్ళు తమిళ్ స్కూలో చేర్చారు

మా ఇంటికి స్కూల్ కి ఐదు కిలోమీటర్లు ఉదయం చిన్నాన్న స్కూల్లో వదిలి సాయంత్రం ఇంటికి తెసుకేల్లెవాడు.మద్యానం భోజనం దగ్గర ఉన్నా బందువు ఇంట్లో తినేవాడిని .కొన్ని రోజులు నన్నూస్కూల్లో వదలడానికి కుదిరేది కాదు.
పెద్దలు అలోచించి ఎలాగైనా తెలుగు నేర్చుకుంటాడు అని పక్కన ఉన్నా తెలుగు స్కూల్లో చేర్చారు.
ఆ స్కూల్లో ఒక మేడం ఇద్దరు సార్లు ఉండేవారు (1975) వారిలో ఓ సారూ మాకు పాఠాలు చెప్పే వాడు నాకు ఏది అర్థమైయేది కాదు!?
జవాబు చెప్పరా అనే వారు నాకేమో నోటి మాట వచ్చేది కాదు చేతితో కర్రతో కొట్టేవాడు చెప్పరా జవాబు అనే వాడు
నేనేమో పోస్ట్ కార్డ్ అనుకునేవాడిని పిల్లలన్దురు అ నుంచి ఆకరి అక్చరమ్ వరకు నేర్చుకుంటే నాకు అ రావడమే గగనమైంది .
ఒకసారి జవాబు చెప్పక పోతే వీపుపై ఒకటిచ్చాడు వీపు వాసింది
ఇంటికి వచ్చాను అమ్మ చూసి బోరున విలపించి మల్లి తమిళ్ స్కూల్ లో చేర్పించారు.
నా నాల్గేళ్ళు ఒకటవ తరగతి లోనే గడిచింది చెప్పు కొడానికి విబ్బండిగా ఉంది ప్రేయర్ లో కాని క్లాస్ లో కాని
వెనుక సీటు నాది అందరు కన్నా పోడుగన్న మాట మనము !? (-_-) హి హీ
తమిళ్ లో చాలా పాస్ట్ నన్ను కొట్టడానికి ఎవ్వడు లేడు................
తిరిగి చూడకుండా ఎడోవ తరగతి వరకు చదివా.
ఇక నేను తమిళ్ నాడు వెళ్ళాలి ఆంధ్రాలో ఆ పై చదువు లేదు.
నాన్న నన్ను ఇంటి నిర్మాణం గురించి నేర్చుకో ఇంకేం చదవవద్దు అని ఆగ్జాపించాడు
ఇక అప్పటి నుంచి నేను సివిల్ కాంట్రోక్టార్ నయ్యాను.

నాన్న గారితో పనులు చెక్క పెట్టడం
ఆయన చెప్పింది చేయడం ఇలా .................
అయిదేళ్ళు ఆయనదగ్గర ఉన్నాను
తరువాత నాకు రెక్కలొచ్చి విడిగా సొంతంగా
భవన నిర్మాణం చేపట్టాను ఇందులో తిరుపతి తిరుమల దేవస్థానం
నిర్మాణం ఎక్కువ. ప్రైవేట్ గాను ఇప్పటికి చేసుకుంటూ వస్తున్నాను
నాకు 18 ఏడు పెళ్లి చేసారు నాన్న గారి స్నేహితుడి కూతురితో .....
నాకు ఇప్పుడు 18 ఎల్ల అబ్బాయి, 16 ఎల్ల అమ్మాయి ఉన్నారు. అయినా
నా జీవితం లో ఎన్నో ఎన్నెన్నో ఎత్తు పల్లాలు నిమ్మటిగా నాలుగు రోజులు గడిపింది లేదు(?).

నా జీవితం మీరు చదువుతోంది ఒక పక్క నాణం మాత్రమె..
రెండో వైపు ఎంతో విషాదం ఎన్నోన్నెన్నో ఆటుపోట్లు ........................

సోదరి వల్ల నేను చేతబడిలో చిక్కుకున్న..........
వివరంగా బ్లాగిస్తాను........
మీ సూచలను ఆచరిస్తూ
prati okkaritonu నాకు ibbandule
..................మీ raghavan

కామెంట్‌లు లేవు: